నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామం ఆంజనేయ స్వామి అర్చకులు సురేష్ శర్మ పై ఆలయ ధర్మకర్త చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న బ్రాహ్మణ, పురోహిత సంఘాలు
తెలంగాణ వార్త డిసెంబర్ 26 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకుంటూ భక్తుల క్షేమం కొరకు భగవంతుని సేవలో పాల్గొంటున్న అర్చకులపై నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామం లోని ఆంజనేయ స్వామి వారి దేవాలయ ధర్మకర్త వెంకటేశ్వర రెడ్డి ఆలయ పూజారి సురేష్ శర్మ పై దాడి చేయ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ & పోలీస్ వారికి విజ్ఞప్తిచేస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘంరాష్ట్ర అధ్యక్షులురామావఝలరవికుమార్, రాష్ట్ర కార్యదర్శి బి. రామాచార్యులు పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎండ్