ప్రభుత్వ భవనాలు మరియు సబ్ స్టేషన్ల నిర్మాణాలకు  సుమారు 35 ఎకరాల భూమి కేటాయింపు 

Aug 6, 2025 - 20:21
 0  8
ప్రభుత్వ భవనాలు మరియు సబ్ స్టేషన్ల నిర్మాణాలకు  సుమారు 35 ఎకరాల భూమి కేటాయింపు 

హర్షం వ్యక్తం చేసిన గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి కి, ఇంచార్జి మంత్రి మరియు సంబంధిత శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే.

త్వరలో భూమి పూజ చేయనున్న ఎమ్మెల్యే.

 జోగులాంబ గద్వాల 6 ఆగస్టు  2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భవనాలు మరియు సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సుమారు 35 ఎకరాల భూమి కేటాయిస్తూ జిఓలు జారీ చేసింది. మండలాలకు సంబందించిన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం, 
విద్యుత్ గోదాముల కోసం,
విద్యుత్ పరికరాల సబ్ స్టోర్,
గిడ్డంగుల నిర్మాణం కోసం, 
PACS భవన నిర్మాణం, వరి  కొనుగోలు కేంద్రం నిర్మాణం, 
బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం, 
జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం,
DTO/RTO/ UO భవన సముదాయం, 
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) భవన నిర్మాణం,
100పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 33/11KV సబ్ స్టేషన్ నిర్మాణం 
 కోసంభూములను కేటాయించారు.

ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కీ, జిల్లా మంత్రులకు, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే  త్వరలోనే ఆయా కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థము అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333