ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి వ్యక్తి మృతి
అడ్డగూడూరు 29 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో తన సొంత బోర్ బావిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన యువకుడు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పరేపాటి వెంకటేష్ తండ్రి సైదులు సుమారు వయసు 27 సంవత్సరాలు తన సొంత వ్యవసాయ బోరుబాయిలో మోటారు పనిచేయ నందున మోటార్ ను తీస్తూ అదుపుతప్పి బోరుబాయిలో బొక్క బోర్లా పడిపోయి మృతి చెందాడని తెలిపారు. ప్రత్యక్షంగా చిగుళ్ల గంగరాజు,కంబాల వీరయ్య, కన్నెబోయిన శంకర్,నల్లమద సతీష్ తెలిపారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.