కోయిల్ దిన్నె శాంతి నగర్ రోడ్డును బాగు చేయండి

జోగులాంబ గద్వాల 6 ఆగస్టు2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి *మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు బోయ రామకృష్ణ ఆధ్వర్యంలో వార్డల పర్యాటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో కర్నూల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కోయిల్ దిన్నె రోడ్డును వేయాలని కోరారు. ప్రధాన సమస్య ఏంటంటే ఈ కోయిల్ దిన్నె రోడ్డు పై బడి పిల్లలు ప్రజలు మోటార్ సైకిళ్ళు చిన్న పాటి వర్షం పడితే బురదకు జారి పడుతున్నారు. జాతీయ రహదారి NH44 అతి దగ్గరగా ఉండే ఈ రోడ్డు వెంట నిత్యం భారీ వాహనాలు తిరుగుతుండటం వలన వర్షం పడి గుంతలు ఏర్పడి ప్రతీసారి మోకాళ్ళ లోతు నీరు వచ్చి చేరుతోంది. కనీసం మున్సిపాలిటీ అధికారులు స్పందించి మున్సిపాలిటీ సరిహద్దు వరకు అయిన బీటీ రోడ్డును వేయాలని కోరుతున్నాము. ఈ దారిన తిరిగే ప్రజలు ఈ రోడ్డుకు మోక్షమెప్పుడు అని ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీ రోడ్లు లేక మురుగు కాలువలు లేక వర్షం నీరు రోడ్డు మీదనే నిలిచిపోతున్నాయి. రోడ్డు మీదనే వర్షం నీరు ఆగడం వలన చిన్నారులు , 9 , 10వ వార్డుకు ఆనుకుని ఈ రోడ్డు ఉండటం వలన కాలనీ ప్రజలు నిత్యం డెంగీ మలేరియా వ్యాధులతో సతమతమవుతున్నారు. అలాగే తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నాము. లేని పక్షంలో కోయిల్ దిన్నె రోడ్డు బురదలోనే ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయ వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు మోహన్ యాదవ్ , శేఖర్ ఆచారి , ఈశ్వర్, నరేష్, రాఘవేంద్ర , బోయ హుస్సేన్ , గోవర్థన్ , హరి , అయ్యరాజు తదితరులు పాల్గొన్నారు.