ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి మండలం, కొండేరు లోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల విద్యాశాఖ అధికారి J. అమీర్ పాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల దివ్యాంగ విద్యార్థులతో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించబడినవి. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను *మండల విద్యాశాఖ అధికారి * *J. అమీర్ పాష మరియు *కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వరద సుందర్ రెడ్డి * మరియు *ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు, జిల్లా పరిషత్ & ప్రాథమిక పాఠశాల కొండేరు ఉపాధ్యాయులు ,ఐఆర్పీ భాగ్యలక్ష్మి , స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ , అలాగే మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.