గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

Dec 23, 2025 - 15:53
 0  53
గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం
గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెలు మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం తేదీ22/12/2025 నుండి31/12/2025 వరకు కొనసాగుతుంది .ఈరోజు రాజశ్రీ గార్లపాడు మరియు ఇటిక్యాల గ్రామాలలో  నట్టల నివారణ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఇటిక్యాల లో జరిగిన  కార్యక్రమాన్ని గ్రామ సర్పంచు జీవంధర్ రెడ్డి  ప్రారంభించారు.  ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి .శివానంద స్వామి  పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గొర్రెల కాపరులతో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని గొర్రెలు మరియు మేకలలో నట్టల నివారణ జరిగితేనే ఆకలి గుణం పెరిగి, బాగా తింటాయని ఆరోగ్యంగా ఉండి అధిక బరువు పెరుగుతాయని, గొర్రె పిల్లల మరణాలు తగ్గుతాయని ,అధిక మాంస ఉత్పత్తి జరిగి ఆర్థికంగా లాభాలు పొందవచ్చని సూచించారు.ఈరోజు జరిగిన కార్యక్రమంలో 3600 జీవాలకు నట్టల నివారణ మందు మందు తాగించడం జరిగిందని పశువు వైద్య సిబ్బంది తెలిపారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీవంధర్ రెడ్డి మరియు పశు వైద్యులు డాక్టర్ భువనేశ్వరి పశువైద్య సిబ్బంది మాసుమన్న కార్తీక్ .మురళి గోపాలమిత్రాలు, గొర్రెల కాపరులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333