44వ డివిజన్ నివాసి కి ఆర్థిక సహాయం చేశారు కార్పొరేటర్ పాలెపు విజయ
44 వ డివిజన్ నివాసి ఫిరంగి వెంకటేశ్వర్లు గారికి డయాబెటిక్ తో కాలు పోవడం జరిగింది. జైపూర్ కుత్రిమ కాలు చికిత్స కోసం స్వయంగా వారి ఇంటికి వెళ్లి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయ వెంకటరమణ గారు. అలాగే భారీ వర్షాలతో మున్నేరు వరదలతో కరుణగిరి రాజివ్ గృహకల్పలో నివాసం ఉంటున్న Sk షమ్ము వారింట్లో నీళ్ల ప్రభావంతో సర్వస్వం కోల్పోవడం జరిగింది వారిది అద్దె ఇల్లు అవడంతో ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందలేదని తెలుసుకొని 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన 44వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయ వెంకటరమణ గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ మోయిన్ గారు, కమతం సతీష్, షేక్ జాని, ఠాగూర్ కోటి, పిన్నిలి రామారావు గారు,సిపిఐ నాయకులు చాంద్ పాషా గారు, సిపిఎం నాయకులు హుస్సేన్ గారు, మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.