ప్రకృతి వనాల్లో పండ్ల మొక్కలు నాటాలి..... రామకృష్ణ యాదవ్

Oct 17, 2024 - 16:54
Oct 17, 2024 - 17:24
 0  0
ప్రకృతి వనాల్లో పండ్ల మొక్కలు నాటాలి..... రామకృష్ణ యాదవ్

మునగాల 17 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలోని ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు నాటాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గురువారం మునగాలలో ఎంపీడీవో పండిట్ దీన దయాల్ కి వినతి పత్రం అందజేసి, మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చెరువు కట్టల వెంబడి ప్రకృతి వనాలను, గ్రామీణ ప్రాంతాల రోడ్ల వెంబడి పండ్ల కాకుండా వేరే మొక్కలు నాటడం వలన పండ్ల మొక్కలు అంతరించిపోవడం వలన వన్య జీవరాసులైన కోతులు గ్రామాలలోని ఇళ్లల్లోకి వస్తున్నాయ వాటిని ప్రజలు తరిమికొట్టడం వలన రోడ్డుమీదికి వెళ్ళగానే రోడ్డు ప్రమాదాలతో అనేక కోతులు మృత్యువాత పడ్డాయని దీనికి ప్రకృతి వనాలలో రోడ్ల వెంబడి పండ్ల మొక్కలు లేకపోవడం వలన పక్షి జాతులైన పావురాలు రామచిలుకలు గ్రద్దలు కొంగలు కాకులు గింజలు లేకపోవడం వలన అంతరించిపోతున్నాయని సృష్టిలో పక్షిరాసులను జీవరాసులను కాపాడుకోవడం మన ధర్మమని ఇప్పటికైనా ప్రజలు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని చెరువు కట్టల వెంబడి ప్రకృతి వనాలలో గ్రామీణ వాతావరణం లో గిన్నె పనులు అల్ల నేరేడు చెట్లు సీతాఫలాలు జామలు ఈత వనాలు మేడి పండ్లు తదితర పండ్లు అందుబాటులో లేకపోవడం వలన ఈ జీవరాశులు అంతరించిపోతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పళ్ళ మొక్కలను విరివిగా నాటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రకృతి వనాలలో. గ్రామీణ యువత ఆధ్వర్యంలో పిచ్చి చెట్లను పీకేసి పళ్ళముక్కల నాటు తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో పండ్ల మొక్కలను అందుబాటులోకి తేవాలని ఎంపీడీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State