మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు ప్లాస్టిక్ నిషేదం పై అవగాహన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 10 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంతినగర్ NSS UNIT-I ఆధ్వర్యంలో వేషవి కాల శిభిరం నాలుగవ రోజులో భాగంగా మంగళ -వారం రోజున NSS వాలింటర్లు కిష్టాపురం గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు ప్లాస్టిక్ నిషేదం గురించి గ్రామంలో ప్లకార్డులతో మరియు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె " రామ ఓబులేషు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరూలనకు గ్రామంలో ప్రతి ఒక్కరు సైనికుడిలా పని చేయాలని మాదక ద్రవ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో NSS ప్రొగ్రామ్ అధికారి P. రాఘ వేందర్, అధ్యాపకులు, 11. ప్రసాద్, S. ప్రదీప్, సర్పంచ్ భర్త నరేష్, ఉప-సర్పంచ్ రవి, పంచాయితీ సెక్రటరీ తులసి మరియు NSS వాలింటేర్లూ పాల్గొన్నారు.