శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటికైనా ఉద్యోగాలు కల్పించండి? అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఆవేదన

Mar 9, 2026 - 19:46
Mar 9, 2026 - 19:50
 0  0
శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటికైనా ఉద్యోగాలు కల్పించండి? అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఆవేదన

09-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : 

నిర్వాసితులకు   ఉద్యోగాలు కల్పించండి! కేశిరెడ్డి దామోదర్ రెడ్డి ఆవేదన?

 శ్రీశైలం నిర్వాసితులకు  ఇప్పటికీ ఇంకా ఉద్యోగాలు రాకపోవటానికి  కర్మ కర్త క్రియ పాత్ర పోషిస్తున్న ఆ మహానుభావులు ఎవరు? ఇప్పటికీ ఇంకా అంతు పట్టని విషయం

 జూపల్లి కృష్ణారావుకు ఏం పాపం చేశాము? జూపల్లి అరచేతుల్లో శ్రీశైలం నిర్వహితులు బందీలుగా ఏర్పడ్డారు.

అనారోగ్యంతో ఉన్న మాజీ అధ్యక్షుడిని పరామర్శించిన శ్రీశైలం నిర్వాసి తుల కమిటీ సభ్యులు.

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల శ్రీశైలం నిర్వాసితుల సంఘం మాజీ అధ్యక్షుడు కేసిరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసిన వెంటనే శ్రీశైలం నిర్వాసితుల కమిటీ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాసులు, సుధాకర్, రంగస్వామి తదితరులు దామోదర్ రెడ్డిని కలసి మనోధైర్యం చెప్పి “అన్నా… మేమున్నాం” అంటూ భరోసా కల్పించారు.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికీ నమ్మకం ఉందన్నారు. గత ప్రభుత్వాలు నిర్వాసితులను మోసం చేశాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జటపోలు సభలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డాగోజీరావు మాట్లాడుతూ దామోదర్ రెడ్డి మహబూబ్‌నగర్ గడిగారం చౌరస్తాలో 188 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి నిర్వాసితుల కోసం పోరాడిన వ్యక్తి అని గుర్తుచేశారు. అలాంటి నాయకుడిని ఈరోజు ఈ స్థితిలో చూడటం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పించాలని, మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా చాలామంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగస్వామి వడ్డెమాను విష్ణువర్మ ఎస్ శ్రీనివాసులు గూడెం శాంతయ్య బాల స్వామి ఎండి జహంగీర్ యాపర్ల దామోదర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State