జిల్లా ఆర్టీవో కార్యాలయంలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

Oct 17, 2024 - 17:29
Oct 17, 2024 - 17:30
 0  1
జిల్లా ఆర్టీవో కార్యాలయంలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

కొత్తగూడెం అక్టోబర్ 17:-ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి. సదానందం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో  వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వాల్మీకి మహర్షి  చిత్రపటానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి సప్తబుషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకిగా మారి అధ్బుతమైన రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ గారని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని .కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సదానందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333