గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎం. రాజ్ ఠాకూర్

Mar 11, 2026 - 20:15
 0  0
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎం. రాజ్ ఠాకూర్

గోదావరిఖని, తెలంగాణ వార్త ప్రతినిధి, ఫిబ్రవరి 11: రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి బంధువులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను  ఎమ్మెల్యే ఎం. రాజ్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... …......

ఆసుపత్రికి వచ్చే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పరిశుభ్రమైన, తక్కువ ధరలో భోజనం అందించేందుకు ఈ క్యాంటిన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడే ఈ క్యాంటిన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333