జగ్గయ్యపేటలో మున్సిపల్ భూముల కబ్జా వ్యవహారం – కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులకు గట్టి హెచ్చరిక

Mar 9, 2026 - 18:49
 0  2

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో కోట్ల రూపాయల విలువైన ప్రజా భూములు అక్రమ కబ్జాలకు గురవుతున్నాయన్న వార్తలు బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.

ఒకటో వార్డు పరిధిలోని ఒకటో సచివాలయం సమీపంలో మున్సిపాలిటీకి చెందిన విలువైన భూములపై అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారనే అంశంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రజల కోసం ఉండాల్సిన మున్సిపాలిటీ భూములు కొందరు వ్యక్తులు నిర్భయంగా ఆక్రమించుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ గంభీరంగా స్పందించినట్లు సమాచారం.

ప్రజా ఆస్తులను కాపాడటంలో నిర్లక్ష్యం సహించబోమని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యేకంగా ఒకటో వార్డు పరిధిలో ఉన్న మున్సిపల్ భూములపై తక్షణమే సమగ్ర పరిశీలన చేపట్టి అక్రమంగా కబ్జా చేసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ మున్సిపల్ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

ప్రజా భూములపై ఎలాంటి ఆక్రమణలు జరిగినా వాటిని సహించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇకపై మున్సిపాలిటీకి చెందిన ఒక్క అంగుళం భూమి కూడా అక్రమ కబ్జాలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

జగ్గయ్యపేటలో జరుగుతున్న ఈ వ్యవహారం పై జిల్లా పరిపాలన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

ప్రజా ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, మున్సిపల్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333