ప్రపంచ ఆహార దినము కాదు ప్రపంచ ఆకలి దినము .

తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల  యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు.

Oct 16, 2024 - 20:43
 0  55
 ప్రపంచ ఆహార దినము కాదు ప్రపంచ ఆకలి దినము .

జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఈరోజు జి నరసింహులు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కూలీలతో  జిల్లా కలెక్టర్ జోగులాంబ గద్వాల   మెమోరాండమును సమర్పించడం జరిగింది. ఇట్టి  మెమోరాండంను  శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి కి చేర్చాలని మెమరాండం ఇవ్వడం జరిగిందని నరసింహులు అన్నారు .
తేదీ ఒకటి అక్టోబర్ 2024 నుండి 16 అక్టోబర్ 2024 వరకు అనగా 16 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్లి కూలీల యొక్క సాధక బాధలు తెలుసుకొని ప్రపంచ ఆహార దినము కాదు ప్రపంచ ఆకలి దినము అనే కార్యక్రమాలను మరియు గాంధీ జయంతి  ప్రపంచ బాలికల దినోత్సవం గ్రామీణ మహిళా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం  జరిగిందని అన్నారు.
మేము వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కూలీలము మాకు దినసరి వేతనము ఒక రోజుకి 20050 ఇవ్వడం జరుగుతుంది పురుషులకు 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నిత్యవసర ధరలు అధికంగా ఉండడం వలన మాకిచ్చే కూలి కుటుంబ పోషణం సరిపోదు కనుక ఆ ఈరోజు ప్రపంచ ఆహార దినము కాదు ప్రపంచ ఆకలి దినముగా పాటించాలని మేము జిల్లా కలెక్టర్ ని కలిసి మెమొరండము ముఖ్యమంత్రికి చేరేవరకు పోరాటం చేస్తామని జిల్లా కలెక్టర్ కి వివరించడం జరిగిందని పేర్కొన్నారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో  మాకు మూడు నెలలు మాత్రమే పని దొరుకుతుంది మిగతా రోజులు పని దొరకడం లేదు మా కుటుంబం పోషణానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే ప్రస్తుతం రైతులు యంత్రాలతో పనిచేయడం వలన మాకు పని దొరకడం లేదు. అందువలన పట్నాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడింది. 
స్త్రీ పురుషులకు సమాన వేతనం ఒకరోజు వేతనం 850 ఇవ్వాలి మమ్ములను నైపుణ్యత కలిగిన కూలీలుగా గుర్తించాలి ఎందుకంటే మేము చేసే పనులను చదువుకునే పట్నాల్లో ఉండేవారు చేయలేరు కనుక ఆ పని మేము చేస్తున్నాము అందుకే మమ్మల్ని నైపుణ్యత కలిగిన కూలీలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం 
మమ్మలను కార్మికులుగా గుర్తించి చట్టబద్ధత కలిగించి కార్డులు ఇవ్వాలి 
వ్యవసాయ కూలి పని చేస్తున్న స్త్రీలు గర్భవతుల అయితే ప్రసూతి ప్రయోజనం కింద ఒక నెలకు పదివేల చొప్పున ఐదు నెలలకు ఐదువేల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న మహిళలు గర్భవతులు అవుతే వారికి ఆరు నెలలు సెలవు దినాలు ఇస్తూ జీతభత్యాలు ఇస్తారు మాకు మాత్రం ఏం లేదు పనిచేస్తే పూట గడుస్తుంది లేకుంటే లేదు అందుకే మాకు కూడా పదివేల రూపాయలు ఐదు నెలలకు ఇవ్వాలని కోరడం జరిగింది. 
మెరుగైన వైద్యము పొందడానికి ఈఎస్ఐ సౌకర్యం కలిగించి చట్టబద్ధత కల్పించాలి పనిచేసే శక్తి నశించిన వారికి ఒక నెలకు 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశక్తువు మరణించినచో వారికి 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించాలి.
ఈ కార్యక్రమంలో  హరిజన వెంకటేష్ అలంపూర్ తాలూకా కోఆర్డినేటర్  కురువ భీమేష్ పూజిత సరస్వతి జయమ్మ శంకరమ్మ నరసమ్మ గోవిందమ్మ కవితమ్మ తదితరులు పాల్గొన్నారు.
[7:29 pm, 16/10/2024] Thimma Gurudu MBNR Alampur: End

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333