పోటీ పడాలని ఉన్న ఆచరణ శూన్యమైతే ప్రగతి ఎలా సాధ్యం?
శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవీయ కోణంలో అభివృద్ధి సాధించాలని ఉంటే తగిన మొత్తంలో నిధులు కేటాయించాలి కదా! కేటాయిస్తేనేమి ఖర్చు చేయకపోతే ఫలితం శూన్యమే. అదే జరుగుతుందని విజ్ఞల భావన.*
***********************************
-- వడ్డేపల్లి మల్లేశం 90 14206412
----21....09....2025*****************
భారతదేశంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు ఒక సమస్య అయితే కేటాయించిన నిధులను కూడా సకాలంలో వినియోగించక మురిగిపోయిన సందర్భాలు కూడా అనేక o. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఒక పద్దుకు కేటాయించిన నిధులను మరొక పద్దు కు మార్చడం, ప్రాధాన్యత రంగాలకు నిధులను కొరత సృష్టించడం, కేంద్రంలో మంజూరైన నిధులు క్షేత్రస్థాయికి చేరుకునే వరకు నామమాత్రంగానే మిగిలిపోవడం భారతదేశంలో తరచుగా జరుగుతున్నటువంటి బడ్జెట్ నిధుల పంపిణీలోని కొన్ని చమత్కారాలుగా చెప్పుకోవచ్చు. మాజీ భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు స్వయంగానే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులలో క్షేత్రస్థాయికి చేరుకునే వరకు నామమాత్రంగా మిగిలిపోవడాన్ని ఆందోళన వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక అరకొర నిధులతోనే ఆయా రంగాలను తృప్తి చేయాలని అనుకుంటే ఆ రంగాలు అభివృద్ధి చెందేది ఎలా? తద్వారా దేశాభివృద్ధి సాధ్యం కావడం గగరమే కదా! శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి కూడా భారతదేశంలో గత కొన్ని ఏ ళ్లు గా జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపు వినియోగాన్ని పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెళ్లడవుతున్నట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది. భారతదేశం ఒకవైపు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్రం చెబుతూ ఉంటే మరొకవైపు అభివృద్ధి చెందిన దేశంగానే కొనసాగుతున్నదని ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలతో ఇండియా కూడా పోటీ పడాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. అందుకోసం వివిధ అవసర రంగాలలో పరిశోధన, పరిశీలన, నిధుల కేటాయింపు, విభాగాల పెంపు, సిబ్బంది నియామకము సక్రమంగా పెద్ద ఎత్తున నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. భారతదేశంలో విభిన్న రంగాలలో ఎదిగినటువంటి నిపుణులు శాస్త్రవేత్తలు పరిశోధకులు అర్ధాంతరంగా ఇతర దేశాలకు వలస వెళ్లిపోవడాన్ని గమనించినప్పుడు ఇక్కడ వారికి ప్రోత్సాహము కరువైనట్లు, నిధుల లేమి బాధిస్తున్నట్లు వారి మాటల్లో అర్థం అవుతున్నది.అందుకే భారతదేశంలో ఎదిగినటువంటి అనేక రంగాల నిపుణులు ఇవాళ ప్రపంచంలోని ఇతర దేశాలలో స్థిరపడినట్లుగా మనకు తెలుస్తున్నది. ఈ రకమైనటువంటి అవ లక్షణాన్ని తొలగించాలంటే భారతదేశంలో ఎదిగినటువంటి వాళ్లను భారతదేశాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి వినియోగించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి. అవసరమైన నిధులను భారీగా కేటాయించడంతోపాటు వారికి సంపూర్ణమైనటువంటి హెచ్చు వేతనాలను అందించడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కనీసమైన సామాజిక బాధ్యత. ప్రైవేట్ రంగం మీద మోజుతో, పెట్టుబడిదారీ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కారణంగా కూడా కేటాయించిన బడ్జెట్ నిధులు దుర్వినియోగం కావడాన్ని మనం గమనించవచ్చు. ఈ రకమైనటువంటి అపసవ్య విధానాలను కట్టడి చేయవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.
డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ పనితీరు:
************************************
శాస్త్రీయ రంగాలకు సంబంధించిన అంశాలలో రాజకీయ జోక్యం అనివార్యమవుతున్న వేళ ఆ ప్రాజెక్టులు కూడా నాసిరకంగా తయారు కావడాన్ని గమనించవచ్చు. అందుకే మేధావులు నిపుణులు జోక్యం చేసుకోవాల్సిన చోట రాజకీయ జోక్యాన్ని నివారించగలిగితేనే దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడగలదు అని చెప్పడానికి పలు ఉదాహరణలు మనం చూపవచ్చు. దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన రంగాలకు శాస్త్రీయ ఆధారాలు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి "డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ" విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి, సరికొత్త పరిశోధనలను ప్రోత్సహించడానికి, నూతన ఆవిష్కరణలకు దారి చూపడానికి, అంతేకాకుండా దేశీయంగా సాంకేతిక కార్యకలాపాలను సమన్వయ పరచడంతో పాటు ప్రపంచ దేశాల విజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవడానికి ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలుస్తున్నది. ఒకవైపు బాధ్యతలను సమన్వయం చేయడంతో పాటు దేశాభివృద్ధిలో కీలకంగా పనిచేసి పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను సమ సమకూర్చడంలో ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ విభాగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, వినియోగం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. మరొకవైపు కేటాయించిన నిధులు వినియోగం కాకుండా మిగిలిపోయినవి అంటే ఈ విభాగంతో పాటు అందుకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదో తెలుసుకోవచ్చు. అసలు భారతదేశంలోనే నిధుల కేటాయింపు విషయములో చాలా తా త్సారంతో పాటు నిర్లక్ష్యం అవినీతి రాజ్యమేలుతాయి. అలాంటి పరిస్థితుల్లో మంజూరైన నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అంటే నిజంగా ఇక మన దేశం ప్రపంచంతో పోటీ పడుతుందనడం ఎంతవరకు సమంజసం? అలాంటి పరిస్థితిలో ఐదవ స్థాయి నుండి మూడవ ర్యాంకు చేరుకున్నదని చెప్పడంలో ఔచిత్యం ఉన్నదా?
నూతన ఆవిష్కరణలతోపాటు వ్యవస్థ నిర్వహణ లో కీలక భూమిక పోషించే ఈ విభాగానికి కేటాయించిన నిధులు సకాలంలో ఖర్చు కాలేదని తెలుస్తూ ఉంటే కారణాలుగా అసంపూర్తి ప్రతిపాదనలు, వి దానపరమైన అడ్డంకులు, మానవ వనరుల కొరత సిబ్బంది కొరత ప్రభుత్వ అలసత్వము, అధికారుల నిర్లక్ష్యము, ఈ దుస్థితికి కారణాలుగా చెప్పుకోవచ్చునని శాస్త్ర సాంకేతిక రంగాలలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. .సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం అవగాహన లేని ఈ అంశాలకు కోటానుకోట్ల నిధులను కేటాయిస్తే ఇంకా కేటాయించకుండా ఇతర రంగాలకు మళ్ళించే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ రాజకీయ జోక్యంతో కొనసాగుతూ ఉంటే సామాన్యులకు ఇదేదీ పట్టని పరిస్థితులలో దేశం అభివృద్ధి చెందుతుందని బ్రమ పడడం తప్ప చేయగలిగింది ఏమీ లేకపోవడం విచారకరం. క్రింది టేబుల్ ద్వారా 2020 నుండి 2025 మధ్యన డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ విభాగానికి కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులను గమనించినప్పుడు ప్రభుత్వ అలసత్వాన్ని అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని బాధ్యతరాహిత్యాన్ని ప్రజలకు తెలియపరచవలసిన అవసరం మరింత ఉన్నదని తెలుస్తుంది.
1)
2020 21 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు 5012 కోట్లు అయితే అందులో సుమారు 100 కోట్లు ఖర్చు కాకుండా మురిగిపోయినవి.
2) 2021 22 సంవత్సరానికి 5244 కోట్లు అయితే సుమారు 100 కోట్లు ఖర్చు కాకుండా మురిగిపోయినవి.
3) 2022 23 సంవత్సరానికి కేటాయించిన నిధులు 49o 7 కోట్లు అయితే 347 కోట్లు వినియోగించబడలేదు.
4) 2023 24 సంవత్సరానికి 4892 కోట్లు కేటాయించబడితే 779 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయినవి.
5) 2024 25 సంవత్సరానికి 57o4 కోట్లు కేటాయిస్తే 586 కోట్లు వినియోగానికి నోచుకోలేదు.
భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాలకు నిధులు కేటాయించడమే గగనం అవుతున్న సందర్భంలో ఈ అ స o తృప్తితో ఇతర దేశాలకు ఎంతో మంది మేధావులు వలస పోతున్న తరుణంలో కొంతమంది అయినా అధికారులు శాస్త్రవేత్తలు పనిచేయడానికి సిద్ధపడిన సందర్భంలో నిధులను సక్రమంగా కేటాయించకపోవడం, కేటాయిo చి న వాటిని వినియోగించే క్రమంలో అనేక నిర్బంధాలు, రాజకీయ జోక్యం వంటి కారణాల వలన ఈ రకమైన దుస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్న తరుణంలో భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాలన్నా ఉత్పత్తి పంపిణీ లోపల కూడా స్వావలంబన సాధించాలన్న నిధుల సద్వినియోగం చాలా కీలకం. ఆ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరం ఉంది.ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం కూడా ప్రభుత్వాలు యొక్క కనీస బాధ్యత ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే పాలిస్తున్న ప్రభుత్వాలు జరుగుతున్న అంశాలను ప్రజలకు తెలియజేయకపోతే ఎలా?
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)