పేరుకు వ్యవసాయ దేశం ఆరోగ్యదాయక తృనధాన్యాల ఉత్పత్తిలో మాత్రం అధమ స్థానంలో...

Oct 12, 2025 - 00:55
 0  1

ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది మరిచిన ప్రభుత్వాల బాధ్యతను గుర్తింప చేయడమే దీని ఉద్దేశం.

--- వడ్డేపల్లి మల్లేశం 

భారతదేశం ప్రపంచంలోనే వ్యవసాయ దేశమని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో ముఖ్యంగా చిరుధాన్యాలు తృణధాన్యాలకు సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను గనుక గమనించినప్పుడు తెల్ల మొగం వేయాల్సిందే. వ్యవసాయ దేశాలుగా గుర్తింపు పొందని అభివృద్ధి చెందిన దేశాలలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరగడాన్ని గమనించినప్పుడు భారతదేశం తన వ్యవసాయ దేశ పాత్రను విస్మరించిందా? లేక పాలకుల యొక్క నిర్లక్ష్యమా?

ఇంతకాలం గర్వంగా చెప్పుకునేదంత మోసమా? అని అనిపించక మానదు. ఒకవైపు పారిశ్రామిక దేశాలుగా కొనసాగుతూనే వ్యవసాయ రంగంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు గోధుమ మొక్కజొన్న బార్లీ ఓట్స్ చిరుధాన్యాలు ఇతర దృణధాన్యాలను ఆ దేశాలు భారీ మొత్తంలో పండించడాన్ని గమనించినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అలాగే ఇవాళ ఆహార ధాన్యాల వినియోగం కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతూ ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్న తరుణంలో కూడా ఈ రకమైనటువంటి పోటీనే మనం గమనించవచ్చు. వ్యవసాయ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి అనే పేరు సంపాదించినా ఇటీవలే కాలంలో ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి చిరు ధాన్యాల ఉత్పత్తిలో మాత్రం భారతదేశ వెనుకబడి పోవడాన్ని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఇటీవల తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం గమనిస్తే భారతదేశ పాలకులు వ్యవసాయ రంగం పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పక తప్పదు. సాధారణంగా పోషకాహారం గా మాత్రమే కాకుండా ఆకలిని తీర్చి ఆరోగ్యంగా ఉంచగలిగే గోధుమలు చిరుధాన్యాలు తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి భారతదేశం క్రమంగా వెనుకబడిపోవడాన్ని గమనించినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యానికి పెను విఘాతము కలిగినట్టుగానే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రకమైన తృణధాన్యాల పైన ఆధారపడి జీవించినటువంటి భారత దేశ ప్రజలు తరాతరాలుగా ఆరోగ్యంగా కొనసాగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.

వెనుకబాటు తనానికి కారణం ఏమిటి :-

********************************* భారతదేశంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడానికి గల కారణాలను పరిశీలించినప్పుడు కొంత ఆందోళన కలగక తప్పదు. వాతావరణ మార్పులు, అతివృష్టి అనావృష్టి వంటి సమస్యలు ఒకవైపు ప్రధాన కారణాలు కాగా గతి తప్పిన సాగు పద్ధతులు, రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకము, నేల కోత, ప్రభుత్వాల ప్రోత్సాహం కొరవ డడం, పురుగు మందుల అతి వాడకం వలన పోషకాలు హరించుకుపో వడం, ఆహారం పట్ల ఆధునిక పోకడలు, సాంప్రదాయ పంటల పైన అనాసక్తి వంటి అనేక కారణాల వలన భారతదేశము చాలా దేశాలతో పోలిస్తే చిన్నధాన్యాల దిగుబడిలో వెనుకబడి ఉండడాన్ని గమనించవచ్చు. ఇప్పటికీ భారతదేశంలో సన్న చిన్న కార్ రైతులు ఎక్కువ యాంత్రికరణ మీద పెద్దగాఆధారపడకపోవడం, వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించక వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, భారతదేశంలో సన్నకారు చిన్న కారు రైతులే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేస్తుండడం వలన కూడా ఉత్పత్తిలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేకపోవడం వళ్ల కూడా భారతదేశవ్యాప్తంగా తృణధాన్యాల ఉత్పాదకత అనుకున్న స్థాయిలో పెరగడం లేదు. కానీ ఇటీవలి కాలంలో తృనదాన్యాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి వినియోగం పట్ల ప్రపంచంలోని ఇతర దేశాలు భారతదేశానికo టే ముందు వరసలో ఉండడాన్ని గమనించినప్పుడు వ్యవసాయ దేశమని పేరు తెచ్చుకున్న భారతదేశం తన ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా ప్రథమ స్థానానికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది అని రూడీ అయ్యింది. అది ఆరోగ్య రీత్యా, ఉత్పాదకరీత్యా, ఎగుమతి రీత్యా, దేశ ఆర్థిక ప్రయోజనాలు రీత్యా కూడా చాలా తోడ్పడుతుంది.

     ప్రపంచంలో పారిశ్రామిక దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ఆధునిక దేశాలు ముఖ్యంగా అమెరికా జపాన్ చైనా ఇంగ్లాండ్ బ్రెజిల్ వంటి దేశాలలో తృ ణ ధాన్యాల ఉత్పత్తి భారతదేశం కంటే భారీగా ముందు ఉండడాన్ని గమనించినప్పుడు కొంత ఆందోళన కలగక మానదు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక మేరకు కొన్ని అంశాలను పరిశీలిస్తే 2023 సంవత్సరానికి గాను తృ ణ ధాన్యాల ఉత్పత్తిలో ఒక హెక్టారుకు టన్నులలో అమెరికా 8.33 టన్నులు ఉత్పత్తి చేస్తే, చైనా 6.42 టన్నులు, జపాన్ 6.25 టన్నులు, వియత్నాం 6 టన్నులు భారతదేశము కంటే అనేక రంగాలలో వెనుకబడినటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్ కూడా తృ ణ ధాన్యాల ఉత్పత్తిలో ముందు వరుసలో ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు .

      ముఖ్యంగా గోధుమ వరి మొక్కజొన్న బార్లీ ఓట్స్ వంటి చిరుధాన్యాలు తృణధాన్యాలు ఆరోగ్యానికి కీలకమైనవి. మొదటినుండి ఆ వాతావరణానికి అనుసంధానమైనటువంటి భారతదేశంలోని ప్రజలు ఈ రకమైన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది .అయితే ప్రస్తుత నివేదిక ప్రకారంగా ఉత్పత్తిలో వెనుకబడిపోయిన కారణంగా ఇతర దేశాలపై ఆధారపడడంతో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా వెనుకబడిపోవడం ప్రధానంగా జరుగుతున్న సమస్యగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తృ ణ ధాన్యాలకు అనుగుణమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి రసాయన ఎ రువు ల వాడకాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా భూమిలోని పోషకాలు చెడిపోకుండా ఉత్పత్తి అయినటువంటి పంట లోపల కూడా ఆ పోషకాలను మనం చూడగలిగితే ఉత్పత్తి ఎక్కువ కావడంతో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితిని కూడా చక్కదిద్దుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి భారతదేశ ఎగుమతి శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీస అవసరాలకే సరిపోని స్థితిలో భారతదేశ ఆహార ఉత్పత్తుల పరిస్థితి దిగజారడం విచారకరం. ఆ పరిస్థితుల నుండి వెంటనే కేంద్రం బయటపడడానికి ఆలోచించాలి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని గణనీయంగా పెంచడానికి, ఉత్పాదకతను సవాలుగా తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైనప్పుడు మాత్రమే అన్ని దేశాల కంటే దిగువన ఉన్నటువంటి భారతదేశ దుస్థితి నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333