పర్దిపురంలో రోడ్డుపైన బైఠాయించిన విద్యార్థులు
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : .అయిజ మున్సిపాలిటీ పరిధిలో పర్దిపురం స్టేజి దగ్గర బస్సులు ఆపడం లేదని. మరియు పాఠశాల సమయంలో ప్రత్యేకమైన ఒక బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు వచ్చే బస్సులు నిండి రావడంతో ఆ బస్సులో ఆపడం లేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆగ్రహించి రోడ్డుపై నిరసన తెలుపుతూ బేటాయించారు. ఉన్నతాధికారులు స్పందించి బస్సు లు విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.