అప్పులతో జీవనం గడుపుతున్నాం
తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
గత ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని కాంటి జంట్ వర్కర్ ,బొబ్బిలి మహేష్ తెలిపారు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీపర్పస్ పనిచేస్తున్న బొబ్బలి మహేష్ తెలంగాణ వార్త పత్రిక తో మాట్లాడారు రాష్ట్రంలో 350 వరకు కాంటి జంట్ వర్కర్లు ఉన్నారని తమకు ఇచ్చే జీవితం 5,500 అవి కూడా మార్చి నుండి ఇప్పటివరకు ఇవ్వలేదు అన్నారు దీంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంటిజెంట్ వర్కర్ల వేతనాలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు..