రాంరెడ్డి వరూధిని దేవి జ్ఞాపకర్ధం కందగట్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

Aug 20, 2024 - 13:58
Aug 20, 2024 - 14:40
 0  17

ప్రారంభించిన AICC సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి.

ఆత్మకూర్ (ఎస్) / కందగట్ల 20 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, AICC సభ్యుడు  రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి లు పిలుపునిచ్చారు. మంగళవారం రాంరెడ్డి వరూధినీ దేవి జ్ఞాపకార్ధం లయన్స్ కంటి ఆసుపత్రి సూర్యాపేట వారి సహకారంతో ఆత్మకూర్ (ఎస్) మండలంలోని కందగట్ల గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ శిబిరం ద్వారా కందగట్ల గ్రామంలో  ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు వేల రూపాయలు డబ్బులు వెచ్చించి వైద్యం చేసుకోకుండా లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్, మాజీ MLA దోసపాటి గోపాల్ తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, ఆత్మకూరు (S) మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు, కందగట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333