పురుగుల మందు తాగి కోమాలోకి వెళ్లిన మహిళను ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 

Jul 5, 2024 - 19:43
 0  80

•తప్పుడు ఆరోపణలు తట్టుకోలేక పురుగుల మందు తాగిన మహిళ కుటుంబానికి అండగా నేనుంటా

•కారకులందరికీ శిక్ష పడేవరకు ఊరుకునేది లేదు

-మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
అడ్డగూడూరు 05 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం, అడ్డగూడూరు మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  (గ్రామశాఖ)అధ్యక్షులు దురుసోజు రవీంద్రచారి భార్య రాజేశ్వరి తన భర్త పై తప్పుడు(అబండాలను) ఆరోపణలు తట్టుకోలేక గురువారం పురుగుల మందు తాగి బలవన్మరాణానికి పాల్పడింది. అది గమనించిన బంధువులు ఆమేని సూర్యాపేట ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.ఆమె అప్పటికే కోమాలోకి వెళ్లిందని లోని శ్రీహాన్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారని అట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా మేమంటే పడని వారు వారి ఇంటికి 1 జులై సోమవారం అర్ధరాత్రి పలువురు వ్యక్తులు వెళ్లి దారుణంగా దాడి చేశారని, అతని భార్యని స్త్రీ అని గౌరవం లేకుండా తాకరానిచోట తాకి అవమాన పరిచారని, కుటుంబ సభ్యులందరిని రక్తాలు వచ్చేలా కొట్టారని రవీంద్రాచారీ దామోదర్ రెడ్డికి విన్నవించుకున్నారు. తన భార్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వారికి శిక్ష పడేలా కృషిచేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని రవీంద్రాచారి దామోదర్ రెడ్డిని వేడుకున్నాడు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోతం రెడ్డి, మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్, వళ్లంభట్ల రవీందర్ రావు, కన్నెబోయిన గంగరాజు, కడారి రమేష్, ఏనుగుతల నాగరాజు, బండి నరసింహస్వామి, గూడేపు నాగరాజు, కప్పల రాజేష్, పనుమటి చంటి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333