నిరుపేద దివ్యాంగుడుకు కలెక్టర్ ట్రై సైకిల్ అందజేత

Mar 20, 2025 - 19:57
 0  2
నిరుపేద దివ్యాంగుడుకు కలెక్టర్ ట్రై సైకిల్ అందజేత

తుంగతుర్తి మార్చి 19 తెలంగాణ వార్త ప్రతినిధి :  తుంగతుర్తి మండలం లోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మధు అమ్మమ్మ దగ్గర ఉంటూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనుటకు రోజు గ్రామం నుండి బడికి పాకతు ఇబ్బంది పడుతున్న మధు గురించిపత్రికలో తెలుసుకున కలెక్టర్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహారావుకు ట్రై సైకిల్ అందజేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. బుధవారంగొట్టిపర్తి గ్రామంలో దివ్యాంగులు మధుకు తన ఇంటి వద్ద మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సిబ్బంది ట్రై సైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా దివ్యంగుడు మధు మాట్లాడుతూ... తన బాధను గుర్తించి వెంటనే ట్రై సైకిల్ అందజేసినందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు కృతజ్ఞతలుతెలిపాడు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333