పలు సూచనలు చేసిన నేలకొండపల్లి ఎస్సై
దసరా సెలవుల దృష్ట్యా దొంగతనాలు మరియు సీసీ కెమెరాలు మీద ప్రజలకు పోలీసుల సూచనలు
గ్రామాలలోనీ మరియు పట్టణాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం.
కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి.
చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పగలు/రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం, నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
*........నేలకొండపల్లి
సబ్ ఇన్స్పెక్టర్-P. సంతోష్*
పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. సెలవులలో విహార యాత్రలు, తీర్థ యాత్రలు, ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు*
????????ఊళ్లకు వెళ్ళేవారు ఇంటిని గమనించమని ఇరుగు/పొరుగు నమ్మకస్తూలైన వారికి చెప్పి వెళ్లాలి.
????????నేలకొండపల్లి పరిధిలో నేను సైతం/ కమ్యూనిటీ, అనే కార్యక్రమం ద్వారా ప్రజలు, దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మీరు కూడా కమ్యూనిటీ సీసీ కెమెరాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలి,సీసీ కెమెరాల ద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను చేదించడం జరిగింది.
????????ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
????????ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. అదేవిధంగా బయట గేటుకు తాళం వేయకపోవడం మంచిది.
????????గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
????????విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
????????తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.
????????అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.
????????అపార్ట్మెంట్లలో కాలనీలలో నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి.
????????పగటి వేళల్లో కాలనీల్లో చిరువ్యాపారుల్లా, సేల్స్ రిప్రజెంటేటివ్‌ల్లా, అడ్రెస్ కోసం వెతుకుతున్న వారిలా పర్యటిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తులుంటే స్థానిక పెట్రోలింగ్ పోలీసులకు మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.
????????ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఉళ్ళకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.
????????వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టేయాలి. ఇంట్లో ఎటువంటి శబ్దం, అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించరాదు.
????????అపరిచిత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆరాతీయడం, వారి ఫోన్ నెంబర్లును, వివరాలను సేకరించాలి. దీని ద్వారా చోరీలు జరిగే అవకాశాలను నివారించవచ్చు.
????????కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
????????తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్ నెంబర్. వీధుల్లో వచ్చే బ్లూ కోల్డ్స్,పెట్రో కార్ పోలీస్ సిబ్బంది యొక్క నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
????????ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్ నెంబర్ దగ్గరుంచుకోవడం మంచిది. కాలనీలలో/గ్రామాలలో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 డయల్ కు మరియు పోలీస్ స్టేషన్ నెంబర్ 8712659139 సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
ఇట్లు
SI of Police
P. Santhosh
Cell 8712659138.