దొరికిన డబ్బులను ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు కు అప్పగించిన మహిళలు
నిజాయితీని చాటుకున్న మహిళలను అభినందించిన ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. పట్టణంలోని బాలికల పాఠశాల ముందు 5,000/- ఎవరివో గుర్తుతెలియని వ్యక్తులవి పడిపోయినాయి. అదే దారిలో ముగ్గురు మహిళలు వస్తుండగా అట్టి డబ్బులు వాళ్లకు దొరకడం జరిగింది. ఇట్టి డబ్బులను పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఎస్.ఐ బాలచంద్రుడు కి అప్పగించడం జరిగింది. అమౌంట్ పోగొట్టుకున్న వారు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ బాలచంద్రుడు ను సంప్రదించగలరు. డబ్బులు దొరికిన వెంటనే ట్రాఫిక్ ఎస్ఐకి అందించి నిజాయితీని చాటుకున్న మహిళలకు ట్రాఫిక్ ఎస్ఐ అభినందించారు.