తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి

Sep 26, 2024 - 18:35
 0  2
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి

భూమి కోసం,భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటం చేసి,మహిళల్లో పోరాట స్ఫూర్తి నింపిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 129వ జయంతిసందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ 

ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారితో పాటు పోలీస్ అధికారులు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ గారు సెప్టెంబరు 26,1895లో జన్మించి చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి అని తెలిపారు.వెనుకబడిన కులంలో జన్మించి కులవృత్తే జీవనాధారంగా జీవిస్తున్న చాకలి ఐలమ్మ గారికి దళారులతో ఎదురైన అవమానాలకు ఎదురొడ్డి వారిపై నిర్విరామ పోరాటం చేసి దొరల పాలనకు చరమగీతం పాడిన వీరమహిళ అని అన్నారు.ఆమె పోరాటంతో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు దక్కిందని తెలిపారు.ప్రపంచానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఐలమ్మ గారి జీవితం ఆదర్శనీయమని అన్నారు.10.09.1985లో మరణించిన ఐలమ్మ గారి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎవరికైనా సమస్య ఉందని తెలిస్తే మన వంతు సహాయంగా న్యాయపరంగా వారి తరఫున పోరాడే విధంగా మనం జీవనాన్ని సాగించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపన కోసం బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు,కార్యాలయ ఏవో జయరాజు మరియు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333