తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి. . జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
జోగులాంబ గద్వాల 28 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం నిల్వలను భద్రంగా ఉంచాలని, ఆరబెట్టిన పంటలు వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచి, క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైతే వరి కోతలు నిలిపి వేయాలని, ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.