తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని సందర్శించిన జర్మనీ డెలిగేట్స్
భారత్-జర్మనీ సంబంధాలను బలోపేతం చేయడానికి వచ్చిన జర్మనీ డెలిగేట్స్ బృందాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం కి వారిని ఆహ్వానించడం జరిగింది. వారి సందర్శన అనంతరం అసెంబ్లీ ప్రాంగణం లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం దగర ఫోటోస్ తీసుకోవడం జరిగింది, జర్మనీ డెలిగేట్స్ తో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ గారు , గద్వాల్ డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు , రాష్ట్ర హస్తకళల చైర్మెన్ నాయుడు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.