పిల్లలమర్రిలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్ర వేడుకలు 

May 2, 2025 - 19:48
 0  8
పిల్లలమర్రిలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్ర వేడుకలు 
పిల్లలమర్రిలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్ర వేడుకలు 

సూర్యాపేట రూరల్ : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ భగవత్ రామానుజాచార్యుల స్వామి తిరు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి తదుపరి విశేష పూజలు నిర్వహించారు.మహిళా భక్తులచే శ్రీ మహా లక్ష్మీ విగ్రహానికి కుంకుమార్చన చేయించి తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్ ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు భక్తులు అంకం భిక్షం, ముడుంభై సారిక,గవ్వ విజయ లక్ష్మీ,అహల్య,సువర్ణ,దేవరశెట్టి అనిత,సునంద, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333