తాళ్లూరి వెంకన్న కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం అందించిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్
శాలిగౌరారం 24 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న అకాల మరణ వార్త తెలుసుకున్న పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరనిలోటని తెలిపారు.ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.బాధిత కుటుంబానికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని తెలిపారు.