అండర్ టెన్ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ విజేతగా జిల్లేపల్లి శర్వాన్

Jun 27, 2024 - 17:41
Jun 27, 2024 - 19:17
 0  1
అండర్ టెన్ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ విజేతగా జిల్లేపల్లి శర్వాన్

మునగాల 27 జూన్ 2024  తెలంగాణవార్త ప్రతినిధి :- సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ గ్రామంలో జరిగిన మేకల అభినవ్ స్మారక అండర్ టెన్ జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్లో మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి లింగయ్య నాగేంద్ర కుమారుడు జిల్లేపల్లి శ ర్వాన్ జిల్లాస్థాయి చెస్ టోర్నమెంటులో ద్వితీయ బహుమతి విజేతగా నిలిచారు జిల్లేపల్లి శర్వాన్ కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్లో 4వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు జిల్లా స్థాయి చె స్ పోటీలో విజయం సాధించడం వలన వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State