కామ్రేడ్ ఆజాద్@ గోపన్న@ కొయ్యడ సాంబయ్య ని కలిసిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వేణుగోపాల్ రెడ్డి

Dec 24, 2025 - 19:24
 0  2
కామ్రేడ్ ఆజాద్@ గోపన్న@ కొయ్యడ సాంబయ్య ని కలిసిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వేణుగోపాల్ రెడ్డి
కామ్రేడ్ ఆజాద్@ గోపన్న@ కొయ్యడ సాంబయ్య ని కలిసిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వేణుగోపాల్ రెడ్డి
కామ్రేడ్ ఆజాద్@ గోపన్న@ కొయ్యడ సాంబయ్య ని కలిసిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వేణుగోపాల్ రెడ్డి

31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఎంతోమందికి సహాయంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలకు తోడుగా నడుస్తూ నిషేధిత మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఆజాద్ ని తన స్వగృహంలో ముద్దుల గూడెం గ్రామంలో యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  మారుతున్న రాజకీయాలు మారుతున్న పరిస్థితులలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ఆస్కారం లేకపోయింది మావోయిస్టు పార్టీకి కావున బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలని రాజ్యాంగబద్ధంగా రాజ్యంలో ఉంటూ పీడిత బలుగు బలహీన వర్గాల కోసం పోరాటం లో తోడ్పడటానికి మద్దతు కోరడం జరిగింది. మారుతున్న రాజకీయ పరిస్థితులను రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు హాన్నితంగా ఉంటూ ప్రజల కష్టాలను తగ్గించుకుంటూ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ముందుకెళ్తే రాజకీయంగా లబ్ధి పొందుతారని కామ్రేడ్ ఆజాద్ తెలిపారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర ప్రజలదేనని ప్రజల తీర్పే తుది తీర్పు అని, అహర్నిశలు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తానని అలాగే భారతదేశంలో జరుగుతున్న మరియు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బడుగు బలహీన బలహీన వర్గాలపై దాడులను యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేస్తూ ప్రజల శ్రేయస్సు కోరుతూ రాజ్యాంగబద్ధమైన పోరాటం చేయాలని కామ్రేడ్ ఆజాద్ కోరారు.  ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని కనీస సదుపాయాలు సౌకర్యాలు లేకుండా బాధలు పడుతున్నారని పీడిత వర్గాలు పీడింపబడుతూనే ఉన్నాయని ఉన్నత వర్గాలు ఉన్నతంగానే ఉన్నాయని కావున మనదేశంలో మరియు రాష్ట్రంలో ఉన్నత రాజకీయాలు తీసుకురావాలని స్వయ లాభం కోసం కాకుండా ప్రజా లాభం కోసం ప్రజల కోసం నిరుపేద గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం నిలబడాలని అలా నిలబడిన వాడే ప్రజా నాయకుడని కామ్రేడ్ ఆజాద్ తెలిపారు.  వివిధ రకాల సమస్యలపై విశ్లేషణ జరిపి తగు కార్యాచరణతో ముందుకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని యువతరం పార్టీ రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లో అన్ని ప్రాంతాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని అలాగే కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ అన్ని పార్టీలు ఒకటై లెఫ్ట్ పార్టీ కింద ఏర్పడి పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ రానున్న స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో విజయం పొంది ప్రజలకు ఆసరాగా నిలుస్తారని నూతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి కోరారు. 
ఈ సందర్భంగా ఖమ్మం గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారని కావున కమ్యూనిస్టులంతా ఒక్కటైతే రాజ్యం మారుతుందని పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే యువతరం పార్టీ ఎప్పుడూ కూడా కమ్యూనిస్టులతో మమేకమై ప్రజల సమస్యల కోసం ముందుకు వెళ్లే విధంగా రూపు అంతరం చెందుతుందని ఆయన అన్నారు. 


ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఆజాద్ కామ్రేడ్ సుజాత మరియు యువతరం పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి గుగులోత్ బాబు మరియు సాకేత్, నాగరాజు రమేష్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333