తక్షణమే డిఏస్సీని రద్దు చేసి మెగా డిఏస్సీని ప్రకటించాలి
ప్రజా పాలనలో నిరుద్యోగులకు తీవ్ర ఆన్యాయం చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 5 జూలై 2021 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ కి హాజరై నిరుద్యోగులకు సంఘీభావం తెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ... -తక్షణమే డీఎస్సీ ని వాయిదా వేయాలి. -25 వేల మెగా డీఎస్సీ ని ప్రకటించాలి.
-గ్రూప్ -1 ప్రిలిమినరీలో 1:100 క్వాలిఫై ప్రకటించాలి.
-గ్రూప్ 2 నోటిఫికేషన్ కు అదనంగా 2000.
-గ్రూప్ 3 నోటిఫికేషన్ కు అదనంగా 3000 పోస్ట్లను పెంచి భర్తీ చేయాలి.
-నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 2500 తక్షణమే అమలు చేయాలి.
-తక్షణమే ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కు చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పక్షాన ఉన్నట్లయితే తక్షణమే పై డిమాండ్లను అమలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ఇప్పటికే 17 సార్లు చెక్కర్లు కొట్టడం ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు. నిరుద్యోగులపై ఉక్కు పాదం మోపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తక్షణమే తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈనాడు నిరుద్యోగులపై ఉక్కు పాదం మోపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు మాధవ్, చిన్న,హరీష్, జోయేల్,నరసింములు, రాము, వేణు,గోపాల్, బజారన్న, జయరాం, కిరణ్, మహేష్ , పరమేష్, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.