అబద్ధాలు మాయమాటలు చెప్పి అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ

May 6, 2024 - 19:49
 0  39

 అభివృద్ధి సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ  లక్ష్యం .. 

 నాగర్ కర్నూల్ పార్లమెంటు  అభ్యర్థిని గెలిపిద్దాం .

 గద్వాల ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకుందాం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి... 

జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  గద్వాల. జిల్లా కేంద్రంలోని 32,33వ వార్డ్ లో చింతలపేట లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్  బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . ఇంటి ఇంటికి  ప్రచారం నిర్వహించడం జరుగుతుంది.
 ముందుగా ఆంజనేయులు స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందడం జరిగినది.  ఎమ్మెల్యే కి నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. 

 ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... 

గద్వాల పట్టణం లో కెసిఆర్  పాలనలో ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ప్రతి వార్డ్ సిసి రోడ్డు డ్రైనేజీ , వ్యవస్థ నిర్మాణం కమ్యూనిటీ హాల్స్, పట్టణ ప్రకృతి  ప్రకృతి వనం, వైకుంఠధామం కూడా మీ వార్డులో నిర్మాణం చేసుకోవడం సాధ్యం కావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు 24 గంటలు నాణ్యత మైన కరెంటును అందజేసేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టినాక ప్రజలకు సమయానికి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో తెలియని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వార్డులలో నీటి సమస్యతో ఇబ్బంది పడేవారు కేసీఆర్  పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాన్ని వండించి స్వచ్ఛమైన తాగునూరిను అందించిన ఘనత మాది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 140 రోజులకు ప్రజలకు సరైన నీళ్లు లేక సాగునీరు తాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏనాడు కూడా అధికారులతో ఏ ఒక్క సమీక్ష సమావేశంలో కూడా నిర్వహించలేదు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు కేవలం స్వార్ధ రాజకీయాల వైపు రాజకీయాలు చేస్తూ రాజకీయ మనుగడలను సాగిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు చేయలేదు. వృద్ధులకు 4000 పింఛన్ రాలేదు, గ్యాస్ సిలిండర్ రాలేదు , ప్రతి పేదవారి ఇంటికి 200 కరెంటు యూనిట్లు ఉచితం అన్నారు ఇంతవరకు అమలు కాలేదు. రైతులకు రైతుబంధు కేసీఆర్  10000 ఇస్తే మేము 15000 ఇస్తామని ఇంతవరకు ఏ రైతు ఖాతాలో కూడా రైతుబంధు జమ కాలేదు. డిసెంబర్ 9వ తేదీ నాడు రైతును రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ మాట తప్పి మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొక్కసారి మోసం చేయడానికి రైతులకు రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెబుతూ పబ్బం కడుతున్నారు. ఐదు నెలల ముందు తెలంగాణ ఎట్లా ఉండె? ఈ ఐదు నెలల్లో ఇంత ఆగం ఎందుకైంది? బిజెపి పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది.ఏనాడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం గానీ  తెలంగాణ రైతాంగం కోసం గాని ఇంతకూడా కనీసం ఆలోచన చేయలేదు. కేవలం మతం హిందుత్వం అనే నినాదంతోనా ప్రజలలోకి వెళ్లి ప్రజలకు మధ్య వార్డుల్లో కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మధ్య  ప్రశాంతంగా ఉన్నవాడిల్లో చిచ్చులు పెట్టడం జరుగుతుంది. సామాన్యులకు పైన నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలకు ఎన్నో ఇబ్బందులను కలిగించింది కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థి  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని మే 13వ తేదీ నాడు కారు గుర్తుపైన ఓటు వేసి వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు, నాగిరెడ్డి,  గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహబూబ్ , భగీరథ వంశీ కురుమన్న రామాంజనేయులు, సీతారాముల, నర్సింహులు,  పవన్ యూదవ్ , నర్సింహులు మోబిన్ , శ్రీనివాస్ యాదవ్ పరశురాముడు, రామకృష్ణ , రాజు, మౌలాలి,నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333