2023 సంవత్సరం తో పోలిస్తే 2024 సంవత్సరం లో తగ్గిన గ్రేవ్,రేప్, హత్య మరియు పోక్సో నేరాలు

లా అండ్ ఆర్డర్ నిర్వహణ: 

Dec 24, 2024 - 23:35
Dec 24, 2024 - 23:38
 0  5

జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.

గద్వాల.గడిచిన సంవత్సరం లో జిల్లాలో ప్రజలందరూ  ప్రశాంత వాతావరణంలో  జీవించేలా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, పోలీస్ మనకోసం ఉన్నారనేలా ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తూ  జిల్లా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహించడం జరిగింది. అలాగే వినాయక నిమజ్జనం, దసరా నవరాత్రి ఉత్సవాలు, రంజాన్, మల్దకల్ ఇతర ఉత్సవాలలో ప్రజలకు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల,  VVIP/VIP ల పర్యటనల సందర్బంగా, పార్లమెంట్, MLC ఎన్నికలలో  ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భoదోబస్తు నిర్వహించడం జరిగింది. 
    జిల్లా లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో బాగంగా ఈ సంవత్సరంలో 2419 కేసులు నమోదు చేయ్యడం జరిగింది
    పోలీసులు L& O నిర్వహణలో చేపట్టిన పకడ్బందీ చర్యల ద్వారా గ్రేవ్ కేసులు గత సంవత్సరం లో94 నమోదు కాగా ఈ సంవత్సరం 69 కేసులు నమోదు అయ్యావి. జిల్లా శాంతి భద్రతల నిర్వహణకు గ్రేవ్ కేసులే ప్రామాణికంగా నిలుస్తాయి,  హత్యలు గత సంవత్సరంలో 12 జరుగగా ఈ సారి వాటి సంఖ్య 9 కు తగ్గింది.

మహిళల రక్షణకు తోలి ప్రాదాన్యతను ఇస్తూ పోలీస్ యంత్రాంగం తీసుకున్నచర్యల ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు గత సంవత్సరం లో201 కేసులు (రేప్- 64, పోక్సో-73) నమోదు కాగా ఈ సంవత్సరంలో186 (రేప్- 31, పోక్సో-44) కు తగ్గాయి. 
    దళితులు, గిరిజనుల పై జరిగే నేరాలకు సంబందించి చిన్న నేరం జరిగిన  ST/SC కేసులు నమోదు చేస్తున్నాము.  తద్వారా గత సంవత్సరం లో25 కేసులు  నమోదు కాగా ఈ సంవత్సరంలో40 కేసులు నమోదు అయ్యాయి. 
    జిల్లా లో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు తీసుకుంటున్నపటిష్ట చర్యలలో బాగంగా గత సంవత్సరం లో90 కేసులు నమోదు కాగా  ఈ సంవత్సరం133 కేసులు నమోదు చేసి 205 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
      రోడ్డు ప్రమాదాలకు సంబందించి గత సంవత్సరంలో102 (Fatal) కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 112(Fatal)  కేసులు నమోదు కావడం జరిగింది. 
    జులై నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు అయిన BSA,BNS,BNSS చట్టాలను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమలు చెయ్యడం జరుగుతుంది,ప్రతి పోలీస్ అధికారి తమ వృత్తి నైపుణ్యంను మెరుగుపరచెందుకు, విదులలో అదునాతన సాంకేతిక పరిజ్నాన వినియోగం పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే విదులలో ప్రతిభ చూపిన వారికి రివార్డులు అందజేయడం జరుగుతుంది.
ACHIEVEMENTS:1) 6 గురికి జీవితకాల జైలు శిక్ష- మనోపాడ్ పోలీస్ స్టేషన్ పరిది లో పాత కక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్ల తో దాడి చేసి హత్య చేసిన  కేసులో 6 గురు నిందితులకు  జీవిత కాల జైలు శిక్ష  విదించడం జరిగింది. అలాగే ఇతర 7 కేసులలో 18 మందికి 5,3,2,1, సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ  కోర్టులు తీర్పులు  ఇవ్వడం జరిగింది. 
2)ప్రాపర్టీ కేసుల చేదన:A)ప్రాపర్టీ నేరాలకు కి సంబంధించి ముఖ్యమైన కేసులను అన్నింటిని ఛేదించడం జరిగింది. అందులో SV ఈవెంట్ హాల్ కేసు , లింగం బాగ్ కాలని లో జరిగిన దొంగతనం కేసులకు సంబంధించి 30 తులాల బంగారు, 4,80,000/- రూపాయల నగదు రికవరీ చెయ్యడం జరిగింది. 
        B) గద్వాల్ టౌన్, గట్టు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన  దొంగతనం కేసులకు    
          సంబందించి 26 తులాల బంగారం ను రికవరీ చెయ్యడం జరిగింది. 
C) పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లిన కేసులో ఆంద్రప్రదేశ్ కు చెందిన పేరు గాంచిన బిట్రా గుంట గ్యాంగ్ నిందితుడిని పట్టుకొని 3,10,000/- రూపాయలు రికవరీ చేయ్యడం జరుగింది. 
D) బైక్ దొంగతనాలకేసులకు సంబందించి 6 గురు నిందితులను అరెస్టు చేసి 35 బైక్ లు రికవరీ చెయ్యడం జరిగింది. 
3)పోలీసుల చోరువతో సురక్షితంగా బస్ ప్రయాణికులు:  జనవరి నెలలో జాతీయ రహదారిపై  ఏర్రవల్లి దగ్గర ప్రవేట్ ట్రావెల్ బస్ ఫైర్ ఆక్సిడెంట్ కేసులో తక్షణమే స్పందించిన పోలీస్ అధికారులు, హై వే  పెట్రోలింగ్ సిబ్బంది ఒక మహిళను మినహా 36 మందిని సురక్షితంగా బయటకు   తీయడం  జరిగింది. పోలీసులు  అర్దరాత్రి వెంటనే స్పందించి ప్రయాణికులను బయటకు తీయడం ద్వారా బారి ప్రాణ నష్టాన్ని  నివారించగలిగాము. 
 4)వరదల సమయంలో జిల్లా పోలీస్ సేవలు: జిల్లా లో ఎడతెరపి లేకుండా వారం రోజుల పాటు కురిసిన వర్షాల దృష్ట్యా కృష్ణ, తుంగభద్ర నది తీరా గ్రామాలలో, రోడ్ల పై ప్రవహించే వాగుల దగ్గర అధికారులు,సిబ్బందిని అప్రమత్తం చేసి ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారి తో కలిసి బోట్ లో ప్రయాణించి గుర్రం గడ్డ దివి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్…

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State