డ్రైవర్ వెంకటన్నపై చర్యలు తీసుకోవాలి
బిఎస్పీ ఆర్టీసీ డీఎంకు వినతి అందజేసిన బీఎస్పీ నాయకులు.
జోగులాంబ గద్వాల 5 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలను అగౌరవంగా మాట్లాడిన డ్రైవర్ వెంకటన్న పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. అదేవిధంగా బస్సులో ప్రయాణించే ఇతర ప్రయాణికులను సైతం పరుష పదజాలంతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ డిఎం R .మంజులకు పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిత్యము ఆర్టీసీ బస్సు గద్వాల డిపో నుండి వావిలాల మీదుగా శాంతినగర్ కు వెళుతుందని ఈ క్రమంలో డ్యూటీలో డ్రైవర్ వెంకటన్న ఉన్నప్పుడు ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ప్రయాణికులు తమకు విన్నవిస్తున్నారని పేర్కొన్నారు.మహిళా ప్రయాణికులను సైతం అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. గతంలో కూడా ఆర్టీసీ డిఎంకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలియజేశారు. డ్రైవర్ వెంకటన్న డ్యూటీలో ఉన్నప్పుడు ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై ఆర్టీసీ ఎండీ.సజ్జనార్ కు కూడా ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేశామని అన్నారు. ప్రయాణికులపై అమర్యాదపూర్వకమైన ప్రవర్తన ఉన్న ఇలాంటి డ్రైవర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్టీసీ డిఎంకు విన్నవించారు.. వినతి పత్రం సమర్పించిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్, గద్వాల నియోజకవర్గ ఉపాధ్యక్షులు సవరన్న పాల్గొన్నారు.