టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఘన నివాళులు

మాజీ మంత్రివర్యులు క్రీస్తుశేషులు టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఘన నివాళులు.....
హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ సామాజిక కార్యకర్త డాక్టర్ దైద వెంకన్న
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణ వార్త తీవ్ర దిగ్భాంతిని కలిగించింది ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఆయన సూర్యాపేట తుంగతుర్తి ప్రజల కు దామన్నగా సుపరిచితులు రెండు నియోజకవర్గాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఖమ్మం కన్నబిడ్డ సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లా తుంగతుర్తి మరియు సూర్యాపేట నియోజకవర్గాల నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నారు రెండుసార్లు మంత్రి పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప రాజకీయ నేత శ్రీరామ్ సాగర్ జలాలను రప్పించిన అపర భగీరథుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశిష్ట సేవలు అందించారు. ఆయనకు కడసారి కన్నీటి ఘన నివాళులర్పిస్తూ దామన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.