మా ఊరుకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి సిపిఐ మండల కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్

Mar 11, 2025 - 18:54
 0  1
మా ఊరుకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి సిపిఐ మండల కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్

అడ్డగూడూరు11 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిదాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో యస్.సి రిజర్వేషన్ కల్పించాలి-సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు అందించడం జరిగింది. గోవిందపురం గ్రామంలో 30 సంవత్సరాలుగా దళితులకు సర్పంచ్ ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ జనాభా తక్కువ ఉన్నారు అనే భావనతో ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయకుండా  అడ్డుకట్ట వేస్తున్న అధికాలులను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ గోవిందపురం గ్రామంలో రెండే సామాజిక తరగతులకు సంబంధించిన కులాలు ఉండడం జరిగింది.బీసీ.బి.తొగట, ఎస్సీ.మాదిగ ఈ రెండు కులాలు మాత్రమే ఈ గ్రామంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామపంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి  ఒక్కసారి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వచ్చి ఎస్సి అభ్యర్థి సర్పంచిగా పరిపాలన కొనసాగించడం జరిగింది. అప్పటి నుంచి  నేటి వరకు సుమారు 30 సంవత్సరాలుగా ఎస్సీలకు రిజర్వేషన్ రాకుండా జనాభా తక్కువ ఉన్నారనే అసంభవనంతోటి రిజర్వేషన్ వర్తింపజేయకుండా అప్పటి అధికారులు కుమ్మక్కై కేవలం ఒక్క బీసీ వర్గానికి మాత్రమే రిజర్వేషన్ ఖరారు చేస్తూ వాళ్లను మాత్రమే సర్పంచ్ గా అధికారం కట్టబెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది జనాభా పెరుగుతుంది. సొసైటీ మారుతుంది రిజర్వేషన్లు కూడా పెరుగుతున్నాయి కానీ దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మాత్రం పక్కదారి పడుతున్నాయి వీటికీ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే అధికారులు గోవిందపురం గ్రామం మీద దర్యాప్తు ప్రారంభించాలని అధికారులను కోరుతూ.. గోవిందపురం దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో శీలం శ్రీనివాస్,చంద్రయ్య,లింగయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333