బాలకార్మికతకు అంతమెప్పుడు
నిత్యం పదులసంఖ్యలో బాల కార్మికుల తరలింపు.

బాల కార్మికులను తరలిస్తున్న వాహన డ్రైవర్ల పై కేసులు నమోదు చేయాలి.
జోగులాంబ గద్వాల 03 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-
ప్రతి రోజు కేటిదొడ్డి, ధరూర్, గట్టు మండలాల నుంచి బొలేరో వాహనాలలో బాల కార్మికులను తరలించడమే కాకుండా ఓవర్ లోడ్ ప్రయాణాలు జరుగుతున్నాయు. వాహనాలల్లో బాల కార్మికులను తరలిస్తున్న సంబంధిత శాఖ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్తి, మిరుప చేనులలో బాల కార్మికులే అధికంగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేసి బాలలను అదుపులో తీసుకుంటున్నారే కాని పూర్తిగా నిర్మూలించడం లేదు.