రాoరెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేసిన మండల నాయకులు

Oct 4, 2025 - 02:06
Oct 4, 2025 - 02:07
 0  111
రాoరెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేసిన మండల నాయకులు

అడ్డగూడూరు 03 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మృతి బాధాకరo.వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నేడు అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించడం జరిగింది. బరువెక్కిన హృదయాలతో జోహార్ దామన్న అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,వల్లంబట్ల రవీందర్ రాష్ట్ర టిపిసిసి నాయకులు బాలెంల సైదులు, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలెంలవిద్యాసాగర్,చిత్తలూరు సోమన్న,వివిధ గ్రామాలశాఖ అధ్యక్షులు, మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచులుఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.