జిల్లాలో 30. 30 (ఎ ) పోలీస్ యాక్ట్ అములు
చిన్నంబావి మండల ఎస్సై, ఏ నాగరాజు
చిన్నంబావి మండలం03డిసెంబర్ 2025తెలంగాణ వార్త : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం ఎస్సై ఏ. నాగరాజు మాట్లాడుతూ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు అనగా (డిసెంబర్ 1 తేదీ నుండి 31 వ తేదీ ) వరకు జిల్లా వ్యాప్తంగా 30. 30 (ఏ ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని చిన్నంబావి మండల ఎస్సై నాగరాజు తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతులు లేకుండా మండలంలో ప్రజలు ధర్నాలు, రాక్షరోకులు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు, నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్ఐ నాగరాజు హెచ్చరించారు. కావున మండల ప్రజాలు మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపారు. ఎటువంటి అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట రీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అనంతరం చిన్నంబావి మండల ఎస్సై నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరైనా ఎన్నికల కమిషన్ నియమా నిబంధనలను ఉల్లంగించినట్టయితే చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది.