బెల్ట్ షాపుల నిర్వాహకులకు హెచ్చరిక ఎస్సై వెంకట్ రెడ్డి

Dec 4, 2025 - 05:18
 0  58
బెల్ట్ షాపుల నిర్వాహకులకు హెచ్చరిక ఎస్సై వెంకట్ రెడ్డి

 తిరుమలగిరి 04 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బెల్ట్‌ షాపులు నిర్వహించిన పక్షంలో కేసులు నమోదు చేస్తామని తిరుమలగిరి ఎస్‌ఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఏ విధమైన అక్రమ మద్యం నిల్వలు ఉన్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.గ్రామాల్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతి–భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని  కోరారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి