ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

Jan 11, 2026 - 22:23
 0  117
ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

తిరుమలగిరి 12 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

వడ్డెర జాతి ఆణిముత్యం,స్వాతంత్ర సమరయోధులు,వడ్డే ఓబన్న 219 జయంతి సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలోని పూలే_ అంబేద్కర్ చౌరస్తా వద్ద వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వివిధ కుల సంఘ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటం చేస్తే అందులో వడ్డె ఓబన్న స్వాతంత్రం కోసం,భావితరాల భవిష్యత్తు కోసం, ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారిలో ఒడ్డే ఓబన్న ఉండడం మన వడ్డెరకులానికి గర్వకారణం అని,ధైర్యానికి మారుపేరే వడ్డే ఓబన్న అని అన్నారు.వడ్డే ఓబన్న జాతి కోసం,దేశం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఓబన్న గుర్తించి వారి ఆశయ సాధన కోసం పని చేయాలని వడ్డెర సంఘం రాష్ట్ర యూత్ కార్యదర్శి పల్లపు సతీష్ కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు కొత్తగట్టు మల్లయ్య,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు,కాంగ్రెస్ పార్టీ నియోజకవ్గ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య, జీ.యం.పి.యస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య,బిజెపి సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ ఎల్సోజు దీననదయల్,సామాజిక ఉద్యమకారులు కందుకూరి ప్రవీణ్, యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు జక్కుల రమేష్, రజక సంఘం మండల అధ్యక్షులు పూలిమామిడి సోమయ్య,బీసీ సంఘం మండల అధ్యక్షులు ముద్దంగుల యాదగిరి,వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు రూపాని రాములు,పల్లపు సైదులు,ఓర్సు రాజు,దండగుల మల్లేష్,ఫీట్ల సారయ్య, రాపాని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి