స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున

ప్రజావాణి కార్యక్రమము తాత్కాలికంగా రద్దు కలెక్టర్ బి ఎం సంతోష్.
జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జడ్పిటిసి, ఎంపిటిసి, గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అసౌకర్యానికి గురికాకూడదని తెలియజేశారు.