ఘనంగా అభివృద్ధి సూర్యుడి జన్మదిన వేడుకలు

Jul 18, 2024 - 20:40
 0  3
ఘనంగా అభివృద్ధి సూర్యుడి జన్మదిన వేడుకలు

- పేదలకు అన్నదానం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో రోల్ మోడల్ గా చేసిన ఘనత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ప్రజలు అభివృద్ధిని ఆశీర్వదించి మరోసారి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట శాసనసభ్యుడిగా తిరుగులేని మెజార్టీ ఇచ్చి గెలిపించి హ్యాట్రిక్ విజయం అందించారని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, 40వ వార్డు కౌన్సిలర్ తాహెర్ పాషా, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బత్తుల జానీ యాదవ్, బొడ్డు దుర్గయ్య మచ్చ రాము,గుంజ శ్రీను,టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333