ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..

Jul 18, 2024 - 20:39
 0  4
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..

డాక్టర్ రామ్మూర్తి సామజిక ఉద్యమ కారులు...( గాయత్రీ నర్సింగ్ హోం చైర్మన్)

పెన్ పహాడ్:  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసినప్పుడే విద్య వ్యవస్థ పేద మధ్యతగతి విద్యార్థులు ఉచితంగా విద్య అందుకొని ఉన్నతంగా ఎదగటానికి అవకాశం ఉంటుందని ప్రముఖ వైద్య నిపుణులు, గాయత్రీ నర్సింగ్ హోం చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి అన్నారు...

గురువారం నాడు పెన్ పహాడ్ మండలం భక్తాల్ల పురం గ్రామం లోని హైస్కూల్ విద్యార్థులకు చైతన్య వేదిక ఆధ్వర్యంలో గాయత్రీ నర్సింగ్ హోం సౌజన్యంతో ఉచితంగా నోట్స్ బుక్స్, కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్సిల్, చరిత్ర, భౌగోళిక పటాలను అందజేశారు...

ఈ సంధర్భంగా డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాల ల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే సుక్షితులైన ఉపాద్యాయులు ద్వారా విద్యార్థులకు అందుతుందని అయన అన్నారు...150 ఏండ్ల క్రితమే జ్యోతీ రావూ పూలే తన భార్య సావిత్రీ భాయి పూలే చదివించి మహిళలకు,పేదలకు తాను స్థాపించిన పాఠశాలలోనే చదువు చెపించినాడని, పూలే స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ అంటరాని తనాన్ని ఎదుర్కొని ఊరు బయట చదివి ఉన్నతంగా ఎదిగి అనేక డిగ్రీలు పొంది ప్రపంచ మేధావి గా ఎదిగి భారత రాజ్యంగ నిర్మాత అయ్యాడని రామ్మూర్తి ఆన్నారు.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బాగా
కష్ట పడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు...

ఈ సంధర్భంగా చైతన్య వేదిక భక్తాల్లాపురం కోఆర్డినేటర్ నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చైతన్య వేదిక కోరగానే హైస్కూల్ విద్యార్థులకు ఉచితముగా నోట్స్ బుక్స్ పెన్నులు పెన్సిల్ చరిత్ర భౌగోళిక చారిత్రక పటాలను అందజేసిన డాక్టర్ రామ్మూర్తి కి అభినందలు.. పాఠశాల అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు ను చైతన్య వేదిక ద్వారా దాతలను 
కోరి అవసరమైన స్టడీ మెటీరియల్స్, మెరిట్ విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్ధిక సహకారాన్ని 
ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి అందించాలని నెమ్మాది కోరారు.. సూర్యాపేట యూరలాజిస్తు కిడ్నీ స్పెషలిస్ట్ చికూరి సాధన్ కుమార్ స్కూల్ పిల్లలకు ఒక జత షూ (shoe ????) అందజేయడానికి స్థానిక స్కూల్ టీచర్ సుజాత మేడమ్ కోరిక మేరకు అంద జేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి స్థానిక హెడ్ మాస్టర్ పరి పూర్ణ చారి అద్యక్షత వహించారు, మాజీ ఎంపీటీసీ చింతం వెంకటేశ్వర్లు ఉపాద్యాయులు నెమ్మని వెంకటేశ్వర్లు, సుజాత,సైదానాయక్ , వహీద్,
చైతన్య వేదిక సభ్యులు ఇరుగు రమేష్, గోపాల్ దాస్ సందీప్ కుమార్, అశోక్, సతీష్, నాగర్జున, నాగేంద్ర బాబు , లింగరాజు, వేణు తదితరులు పాల్గొనగా సూర్యాపేట పట్టణం లోని మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్స్ జ్యోతీ కరుణాకర్,నిమ్మల వెంకన్న, బైరబోయిన శ్రీను, కొమ్మాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333