పలు సమస్యలపై కలెక్టర్ ను కలిసిన మాజీ ఎంపీపీ.
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. పలు సమస్యలపై కలెక్టర్ ను కలిసిన మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ .. జిల్లా కలెక్టర్ కార్యంలో గట్టు మండలంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ B.M సంతోష్ ని కలిసి వినతి వినతి పత్రాలు ఇస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య అయినా బలిగేరా ఓహెచ్ బిఆర్ నుండి సరఫరా కావలసిన తాగునీరు ఈ గ్రామాలకు మల్లంపల్లి కొత్తపల్లి చాగదోన మిట్టదొడ్డి ముచ్చోనిపల్లి తుమ్మలపల్లి అంతం పల్లి చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఐజ మండలంలోని ఈడుగోనిపల్లి సంకాపురం చమన్ ఖాన్ దొడ్డి ఇందువాసి బోయిలగూడెం లింగాపురం గ్రామాలకు సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ కు అసలు వాటరే ఎక్కడం లేదని ఈ సమస్యను పలుమార్లు తాగునీటి సరఫరా అధికారుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తాగునీటి కొరత తీరుస్తామని చెప్పడమే తప్ప తీరలేదన్నారు కావున మీరు వెంటనే తాగునీటి అధికారులు ఆదేశించి పూర్తిస్థాయిలో త్రాగునీరు సరఫరా అయ్యే విధంగా సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని కోరడమైనది. చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సమస్యలు.....చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్లో పలు సమస్యలు అలాగే పెండింగ్ పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించే విధంగా ముఖ్యంగా కొత్త సెంటర్లో ప్రభుత్వ పాఠశాల లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులు పక్క గ్రామానికి రోజు నడుచుకుంటూ ఆటోలో వెళ్లి రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే ఆ మీరు ఇచ్చిన మాట ప్రకారం మధ్యలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించి పూర్తి చేయించే విధంగా కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చి పని పూర్తి చేయించగలరని కోరమైనది. అదేవిధంగా విద్యుత్ సమస్యకు గ్రామానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్స్ లేక ఆనాఫ్ సిస్టం ఏర్పాటు చేయడము కొన్ని లైన్లకు వైరు గుంజడము వంటి సమస్యలు మిగిలి ఉన్నాయని వాటికి సంబంధించిన విద్యుత్ ఎస్టిమేషన్ మీ దగ్గర మంజూరు కోసం ఫైలు పెండింగ్ లో ఉన్నది దానిని చూసి త్వరగా శాంక్షన్ మంజూరీ చేసి పనులు పూర్తి చేయించగలరని కోరడమైనది. అదేవిధంగా గ్రామానికి కొత్తగా రెండు రోడ్లు మంజూరి అయి ఉన్నాయి 1 ఆర్అండ్ఆర్ సెంటర్ నుండి రెండు గుట్టల మధ్యన వరకు బీటీ రోడ్లు అనుసంధానం చేస్తూ సిసి రోడ్డు మంజూరి అయి ఉన్నది 2 ఆర్అండ్ఆర్ సెంటర్ నుండి భుంపురం ఐజ మండలం వరకు బీటీ రోడ్డు మంజూర అయి ఉన్నది ఈ రెండు రోడ్లను కూడా టెండర్లు దశలో ఉన్నాయి టెండర్లు పిలిచి రోడ్డు పనులను ప్రారంభించగలరని కోరునైనది. అదేవిధంగా గ్రామానికి గ్రామపంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరే అయి ఉన్నది దానిని మరల రీ టెండర్ పిలిచి పని ప్రారంభించగలరని కోరనైనది కావున పై సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించగలరని కోరనైనది.