గ్రామాలలో ప్రజలు సోదర భావంతో మెలగాలి.. సీఐ టంగుటూరి శ్రీను 

Jan 7, 2025 - 19:32
 0  10
గ్రామాలలో ప్రజలు సోదర భావంతో మెలగాలి.. సీఐ టంగుటూరి శ్రీను 

గ్రామాలలో ప్రజలు సోదర భావంతో మెలగాలి.. సీఐ టంగుటూరి శ్రీను గ్రామాలలో ప్రజలు సోదర భావంతో మెలిగి శాంతి సామరస్యానికి కృషి చేయాలని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను అన్నారు. మల్దకల్ మండలంలోని అమరవాయి బిజ్వారం గ్రామాలలో మంగళవారం  ఎస్ఐ నందికర్ తో పాటు పర్యటించి గ్రామాలలో శాంతి సామరస్యాలకు ప్రజలు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రజలందరూ సోదర భావంతో మెలగాలన్నారు. ఏవైనా సమస్యలుంటే ముందుగానే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామాలలో యువకులు గంజాయి తదితర మత్తుపదార్థాల వ్యసనం ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు కోడిపందాలు పేకాట డ్రగ్స్ తదితర వినియోగాలపై  తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాలలో చిన్న చిన్న తగాదాలు వస్తే గ్రామాలలో పరిష్కరించుకోవచ్చని లేని పక్షంలో మా సహకారం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిగే ప్రమాదాలకు వారి కుటుంబం ఎంతో నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయ పొలాలలో వాడిన క్రిమిసంహారక మందులను మిగిలిన పక్షంలో వాటిని అక్కడే పారబోయాలని దానిని ముందు వాడతాం అని స్టాక్ పెట్టుకో రాదని తెలిపారు. క్షణికా వేశాలకు లోనై మిగిలిన క్రిమిసంహారక మందులు తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారని సీఐ తెలిపారు. గ్రామాలలో శాంతి సామరస్యం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎస్సై నందికర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో గ్రామాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం లేదని అన్నారు. ఎలాంటి సమస్యలున్న తమ శాఖపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్సై తెలిపారు. మాజీ ఎంపీపీ రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎలాంటి సమస్యలు లేవని ప్రస్తుతం కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నా వాటిని గ్రామంలోని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్య రెడ్డి పోలీసు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333