న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి

వేడుకల పేరుతో ప్రజా  జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్సై నాగరాజు 

Dec 30, 2024 - 20:16
 0  65
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి

అడ్డగూడూరు 30 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల పరిసర ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలనీ ఎస్సై నాగరాజు కోరారు.ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు పెద్దలు అందరూ వారి ఇండ్లలో ఉత్సవాలు జరుపుకోవాలనీ, పోలీసు వారి సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు.అవాంఛనీయ సంఘటనలు జరగాకుండా అద్దగూడూరు పోలీస్ శాఖ  తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరిగినది అని తెలిపారు.డిసెంబర్‌ 31రాత్రి వేడుకలు, నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అడ్డగూడూరు పోలీస్ నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు.కొన్ని ప్రాంతాల్లోను డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని,అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అడ్డగూడూరు పోలీసుల సూచనలు నిబంధనలు..నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు రాత్రి 12:30 గంటల వరకు పూర్తి కావాలి.తర్వాత కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాoపిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలి, మైనర్స్ కు వాహనాలు ఇవ్వవద్దు.టపాసులు,డీజేలు నిషేధం.మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం,వాహనాలు వేగంగా నడపవద్దు.రహదారులు బ్లాక్ చేసి ఉత్సవాలు చేయవద్దు.మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవద్దు.ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు.ఇల్లు,ప్రవేట్ ఆస్తులపై,వీధి దీపాల పై రాళ్లు వేయడం,అద్దాలను పగలగొట్టడం నేరం.ర్యాష్ డ్రైవింగ్,బైక్ రేసింగ్,త్రిబుల్ రైడింగ్,సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం,శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాo న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్,గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి,మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో,ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతాం.మైనర్లు వాహనాలు వాహనాలు ఇవ్వవద్దు.ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా  ఎర్పాటు చేసే  ఎలాంటి  కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలి- న్యూ ఇయర్ అఫర్ ల పేరిట సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉన్నది కావున ఆన్లైన్ నందు, అపరిచితులతో వ్యక్తిగత సమాచారం,బ్యాంక్ అకౌంట్ వివరాలు,పిన్ నబర్స్ లు ఇవ్వవద్దు.అంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అత్యవసర సమయంలో పోలీసు అధికారులకు, డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలు ఉపయోగించుకోవాలి ఎస్సై నాగరాజు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333