సిపిఎం సీనియర్ నాయకుడు మృతి

Jul 9, 2024 - 20:47
Jul 9, 2024 - 20:49
 0  2
సిపిఎం సీనియర్ నాయకుడు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సిపిఎం సీనియర్ నాయకుడు మృతి ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గట్టికల్ గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ మోరపాక మల్లయ్య 98. అనారోగ్యం తో మంగళ వారం మృతి చెందారు. వారి పార్థివ దేహానికి జిల్లా కమిటీ సభ్యుడు దండా వెంకట రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.మల్లయ్య మృతి పట్ల గ్రామ కార్యదర్శి రాచకొండ సైదులు కమిటీ మెంబర్స్ సీనియర్ కామ్రేడ్ గుండు అబ్బయ్య ,గుండు లింగయ్య,చిన్న లింగయ్య రంగు పూలమ్మ, గుండు బుచ్చమ్మ, గుండు రమేష్ మడ్డి పెద్దబ్బయ్య, మద్దికుంట్ల బిక్షం నివాళులర్పించారు. గ్రామ సిపిఎం అభిమానులు కార్యకర్తలు అందరూ ఘనంగా  నివాళులు అర్పించినారు. మృతుడు మల్లయ్య కు భార్య ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు.