గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు. ఆత్మకూరు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిaఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయానికి పాఠకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. గ్రంథాలయాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని యువకులు నిరుద్యోగులు గ్రంథాలయాలను ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైబ్రేరియన్లు శ్యాంసుందర్ రెడ్డి రంగారావు స్థానిక లైబ్రేరియన్ సృజన తదితరులు ఉన్నారు