కరుణించని వరుణుడు ఆందోళన చెందుతున్న రైతులు

జోగులాంబ గద్వాల 16 జూలైతెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా లో మే నెలలో ముందస్తు వర్షాలు కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ రైతులు భూమిని దుక్కి దున్ని సాగుకు సన్నద్ధం చేశారు. ఇందులో భాగంగా జూన్ నెలలో వేరుశనగ కంది, ఉల్లి, కొర్ర, సజ్జ, పత్తి, ఆముదాలు సాగు చేశారు సాగు చేసిన అనంతరం కొన్ని రోజులుగా చినుకు జాడ కనపడకపోవడంతో వేసిన పంటలు వాడి పోతుండడంతో రైతులు నష్టపోతున్నారు. ఎండలు కూడా పెరగడంతో మొలచిన మొలకలు ఎండి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరాకు 10 వేలు నుండి 20వేల రూపాయల వరకు ప్రస్తుతం పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. ఇంకో పది రోజులు వర్షం రాకపోతే పంటలన్నీ ఎండిపోతాయని కావున వ్యవసాయ అధికారులు పొలాలను సందర్శించి రైతులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు..